రాణించిన ఐసీసీఐ బ్యాంక్
ఐసీఐసీఐ బ్యాంక్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 9,121.87 కోట్ల నికర లాభాలన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంక్ రూ. 7018.71 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇదే కాలంలో బ్యాంక్ నికర ఆదాయం రూ. 42,834.06 కోట్ల నుంచి 25.88% శాతం పెరిగి రూ. 53,922.75 కోట్లకు చేరింది. నికర ఖర్చులు రూ 38,716.56 కోట్లకు పెరిగినట్లు బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ డిపాజిట్లు 10.9% పెరిగాయని పేర్కొంది. నాలుగో త్రైమాసికంలో మొత్తం 1,180,841 కోట్ల డిపాజిట్లను సమీకరించినట్లు వెల్లడించింది. నికర ఎన్పీఏ నిష్పత్తి 0.48% కి తగ్గిందని బ్యాంక్ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కొత్తంగా 480 బ్రాంచ్ లను ప్రారంభించినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. తన వాటాదారులకు రూ. 8 లను ఫైనల్ డివిడెండ్‌గా ఇవ్వాలని నిర్ణయించింది.