For Money

Business News

స్థిరంగా ప్రారంభం కానున్న మార్కెట్లు

రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయి. సూచీల్లో దాదాపు మార్పు లేదనే చెప్పొచ్చు. నాస్‌డాక్‌ 0.29 వాం నష్టపోగా, డౌజోన్స్‌ 0.2 శాతం లాభంతో ముగిశాయి. డాలర్‌ ఇండెక్స్‌ మరింత బలహీనపడి 101కి చేరింది. దీంతో బులియన్‌ మార్కెట్‌ కళకళలాడింది. ఔన్స్‌ బంగారం ధర 2000 డాలర్లను దాటింది. అలాగే క్రూడ్‌ ధరలు కూడా కోలుకున్నాయి. ఇక ఆసియా మార్కెట్లు మాత్రం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా చైనా, హాంగ్‌సెంగ్‌లు ఒక శాతంపైగా నష్టంతో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ మాత్రం 0.3 శాతం లాభంతో ఉంది. ఇక సింగపూర్ నిఫ్టి 15 పాయింట్ల లాభంతో ఉంది. కార్పొరేట్‌ ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో నిఫ్టి గ్రీన్లో ప్రారంభం కావొచ్చు. మరింత ఈ లాభాలను నిలుపుకుంటుందా అన్నది చూడాలి.