For Money

Business News

17800పైన ముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు డల్‌గా ఉన్నా మన మార్కెట్లు చక్కటి లాభాలతో ముగిశాయి. ఆరంభంలో స్వల్ప ఒత్తిడికి లోనైనా… క్లోజింగ్‌లో గట్టి మద్దతు అందింది. ముఖ్యంగా ఆటో, రియాల్టి షేర్లు నిఫ్టికి అండగా నిలిచాయి. నిఫ్టి 44 పాయింట్ల లాభంతో 17813 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు అన్ని కీలక సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. జీఎన్‌ఎఫ్‌సీ, వోడాఫోన్‌, ఇండస్‌ టవర్‌ షేర్లలో లాంగ్‌ బిల్డప్‌ కన్పిస్తోంది. జీఎన్‌ఎఫ్‌సీ, ఎంసీఎక్స్‌, ఓల్టాస్‌ షేర్లలో వంద శాతం అధిక టర్నోవర్‌ నమోదైంది. నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో పవర్‌ గ్రిడ్‌, టాటా కన్జూమర్‌, నెస్లే, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌తో పాటు ఎస్‌బీఐ లైఫ్‌ ఉన్నాయి. ఇక నష్టాల్లోని నిఫ్టి షేర్లలో హిందాల్కో టాప్‌లో ఉంది. అదానీ పోర్ట్స్‌, అదానీ ట్రాన్స్‌, అదానీ టోటల్‌ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ టవర్‌ నాలుగు శాతం లాభపడింది. మిడ్‌ క్యాప్‌ షేర్లలో రెండు శాతం లాభంతో అరబిందో ఫార్మా టాప్‌ గెయినర్‌గా నిలిచింది.