పీవీఆర్ -సినీపొలిస్ విలీనం?
మనదేశంలో అతి పెద్ద మల్టిప్లెక్స్ చెయిన్ అయిన పీవీర్ సినీపొలిస్‌ను టేకోవర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు రెండు కంపెనీల చర్చలు జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పీఆర్‌కు దేశ వ్యాప్తంగా 71 నగరాల్లో 176 మాల్స్ 846 స్క్రీన్స్ ఉండగా, సినీపొలిస్‌కు 61 నగరాల్లో 61 థియేటర్లలో 417 స్క్రీన్స్ ఉన్నాయి. సినీపొలిస్ మెక్సికోకు చెందిన సంస్థ. ఈ రెండు కంపెనీలు విలీనమైతే 1263 తెరలతో దేశంలో అతి పెద్ద మల్టీప్లెక్స్ సంస్థగా మారుతుంది. విలీన కంపెనీలో సినీపొలిస్‌కు 20 % వాటా ; పీవీఆర్ ప్రమోటర్లకు 24 శాతం వాటా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. విలీన తరవాత ఏర్పడే కంపెనీపై తొలి మూడేళ్ల పాటు ప్రస్తుత పీవీఆర్ సీఎండీ అజయ్ బిజీకి యాజమాన్య బాధ్యతలు ఉంటాయని తెలుస్తోంది. అయితే ఈ విలీన వార్తలపై స్పందించేందుకు రెండు కంపెనీలు నిరాకరించాయి.