For Money

Business News

పుష్ప 2 టార్గెట్‌ రూ. 1,500 కోట్లు?

ఏకంగా రెండు రోజుల ముందు సినిమా విడుదల చేయడం పుష్ప 2 గేమ్‌ ప్లాన్‌ బాగా పనిచేసింది. ప్రీమియంతో మొదటి రోజు కలెక్షన్స్‌ పెరిగాయి. గురు, శుక్రవారాల్లో సినిమాకు వస్తున్న టాక్‌తో శని, ఆదివారం అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాయి. ఇవాళ ఉదయానికల్లా అడ్వాన్స్‌ బుకింగ్‌ టికెట్ల సంఖ్య 32 లక్షలు దాటింది. ఒక సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల వద్ద జాతర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాదిలో ఈసినిమాకు ఎక్కడ లేని క్రేజ్‌ ఏర్పడింది. అనేక మల్టిప్లెక్స్‌లు స్క్రీన్స్‌ సంఖ్యను పెంచాయి. దాదాపు దేశంలోని దాదాపు అన్ని సింగిల్ స్క్రీన్స్‌లో పుష్ప2 ఆడుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ సినిమా ఫస్ట్‌ డే కలెక్సన్స్‌ రూ. 294 కోట్లు (అంతర్జాతీయ మార్కెట్లు కలుపుకుని) సాధించి… బాలీవుడ్‌లో నయా చరిత్ర సృష్టించింది. పాత రికార్డులను తుడిచి పెట్టేసింది. పుష్ప ద రైజ్‌ను తక్కువ రేటుకే హిందీ వెర్షన్‌ హక్కులను నిర్మాతలు అమ్మేశారు. ఈసారి మాత్రం భారీ రేటుకు అమ్మారు. దీనికి కారణం పుష్ప2కు దక్షిణాది మార్కెట్‌కు దీటుగా ఉత్తరాదిలో కనకవర్షం కురిస్తుందని అంచనా వేయడం. వీరి అంచనా బాగా పనిచేసింది. మొత్తం కలెక్షన్స్‌లో ఏకంగా 50 శాతం వరకు కలెక్షన్స్‌ ఉత్తరాది నుంచి అంటే హిందీ వెర్షన్‌ నుంచి వచ్చే అవకాశముందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. సినిమా రిలీజ్‌ ముందు… పుష్ప 2 వెర్షన్‌ కలెక్షన్స్‌ రూ. 800 కోట్లకు చేరుతాయని అంచనా వేశారు. సినిమా విడుదల తరవాత వస్తున్న టాక్‌ చూస్తుంటే ఈ సినిమా లైఫ్‌టైమ్‌ కలెక్షన్స్‌ రూ. 1200 కోట్ల నుంచి రూ. 1500 కోట్లకు చేరుతాయని భావిస్తున్నారు. దరిదాపుల్లో మరో పెద్ద మూవీ లేకపోవడం… ఇయర్‌ ఎండ్‌ కావడంతో పుష్ప2 హంగామా చాలా రోజులు సాగుతుందని.. కలెక్షన్ష్‌ మరింత పెరుగుతాయని కూడా ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి.