పెరిగినా నిలబడటం కష్టం… అశ్విని
ఇవాళ మార్కెట్లలో స్వల్ప పుల్ బ్యాక్ వచ్చినా.. అధిక స్థాయిలో నిఫ్టి నిలబడకపోవచ్చని ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్విని గుజ్రాల్ అన్నారు. అమెరికా మార్కట్లు గ్రీన్లో ఉన్నా… లాభాలను కొనసాగించలేక పోయాయని ఆయన గుర్తు చేశారు. నిఫ్టికి ఇవాళ స్వల్ప మద్దతు లభిస్తే… అధిక స్థాయిలో అమ్మడానికి ప్రయత్నించమని ఆయన అంటున్నారు. నిఫ్టికి 16850 దాకా పెద్ద మద్దతు లేదన్నారు. మధ్య ఉన్న మద్దతు స్థాయిలు చాలా బలహీనంగా ఉన్నాయని అన్నారు. కాబట్టి ”సెల్ ఆన్ రైజ్” వ్యూహాన్ని అమలు చేయడం మంచిదని అన్నారు. గట్టి ర్యాలీకి ఇంకా సంకేతాలు రాలేదన్నారు.