For Money

Business News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

అధిక స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు మళ్ళీ లాభాలు స్వీకరించారు. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఉదయం కేవలం పావు గంట లాభాల్లోఉన్న మార్కెట్‌ వెంటనే పతనం కావడం ప్రారంభమైంది. 11 గంటలకల్లా 16909 పాయింట్లకు పడింది.అంటే 255 పాయింట్లు క్షీణించిందన్నమాట. ఉదయం పై స్థాయిలో షార్ట్‌ చేసినవారికి భారీ లాభాలు దక్కాయి. మిడ్‌ సెషన్‌లో కాస్త పెరిగినట్లు కన్పించినా… చివరిదాకా రెడ్‌లోనే ఉంటుందా అన్నది చూడాలి. ఎందుకంటే ఇవాళ యూరోపియన్‌, అమెరికా మార్కెట్లకు క్రిస్మస్‌ సెలవు. వచ్చే సోమవారం కూడా విదేశీ మార్కెట్ల పనితీరు అంతంత మాత్రమే ఉండేలా ఉంది. ఎందుకంటే చాలా మంది ప్రధాన ఇన్వెస్టర్లు పండుగ, కొత్త ఏడాది కారణంగా మార్కెట్‌కు దూరంగా ఉండే అవకాశం అధికంగా ఉంటుంది కాబట్టి.