ప్రిస్టీజ్ ఎస్టేట్ షేర్ జూమ్…
దాదాపు రియల్ ఎస్టేట్ షేర్లన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రిస్టేజ్ ఎస్టేట్ షేర్ ఏకంగా ఏడు శాతం లాభంతో ట్రేడవుతోంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ బుకింగ్స్ అమ్మకాలు రెంట్టింపు అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే రూ. 2026 కోట్ల నుంచి రూ. 4267 కోట్లకు చేరాయి. అలాగే ఈ త్రైమాసికంలో కంపెనీ అత్యధిక కలెక్షన్స్ సాధించింది. 70 శాతం పెరిగి కలెక్షన్స్ రూ. 2431 కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి డిసెంబర్ అంటే 9 నెలల కాలంలో కంపెనీ అమ్మకాలు 97 శాతం పెరిగి రూ. 7113 కోట్లకు చేరాయి.