ఇండియా సిమెంట్ లాభం 76% డౌన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండియా సిమెంట్స్ లాభాలు భారీగా క్షీణించాయి.ఈ కాలానికి రూ.1,160 కోట్ల కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయంపై రూ.16 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 1184 కోట్ల టర్నోవర్ రూ. 67.9 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ లెక్కన చూస్తే కంపెనీ నికర లాభం 76 శాతం క్షీణించింది. టర్నోవర్ 2 శాతం తగ్గగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ 55 శాతం తగ్గి రూ. 158 కోట్ల నుంచి రూ. 71 కోట్లకు క్షీణించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ ఉత్పత్తి సామర్ధ్య వినియోగం 61 శాతం నుంచి 54 శాతానికి పడిపోయింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాలను తట్టుకునేందుకు వినియోగదారులపై మరింత భారం మోపక తప్పదని కంపెనీ తెలిపింది. అనేక చోట్ల కంపెనీ ప్లాంట్లను చాలా కాలం మూసేయాల్సి వచ్చింది.