For Money

Business News

ఫోన్‌ రీచార్జ్‌ఫై రూ. 50 దాటితే ఫీజు

ఫ్రీ అంటూ ఒక్కో సర్వీసును అలవాటు చేశాక… క్రమం చార్జీలు వేయడం రిలయన్స్ జియోతో మొదలైంది. ఇపుడు ఫోన్‌ పే కూడా ఆ బాటలో పయనిస్తోంది. రూ 50కి మించిన మొబైల్‌ రీఛార్జీలపై ప్రాసెసింగ్‌ ఫీజును వసూలు చేయునన్నట్లు ఫక్షన్‌పే పేర్కొంది. వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన ఈ డిజిటల్‌ చెల్లింపుల సంస్థ రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1 నుంచి రూ.2 చొప్పున ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది. యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు విధించడం ఇదే మొదటిసారి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇది కేవలం ఎంపిక చేసిన కొంత మంది వినియోగదారులపైనే ప్రయోగాత్మకంగా వసూలు చేస్తున్నామని ఫేన్‌పే పేర్కొంది. చాలా కొద్ది మందికి ఈ చార్జీలు వసూలు చేస్తున్నామని తెలిపింది. ఇతర మనీ ట్రాన్సఫర్‌ సేవలను ఉచితంగా అందిస్తామని పేర్కొంది.