8వ తేదీ నుంచి దశలవారీగా ధరలు పెంపు
ఈనెల 7వ తేదీన అసెంబ్లీ ఎన్నికల చివరి దశ ఎన్నికల పోలింగ్ పూర్తవుతుంది. అదే రోజు రాత్రి నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయి. 8వ తేదీ నుంచి నుంచి రేట్లు పెంచేందుకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ప్రభుత్వ వర్గాలను పేర్కొంటూ రాయిటర్స్ వార్త సంస్థ వెల్లడించింది. పెట్రోల, డీజిల్పై లీటరుకు రూ. 10 లేదా రూ. 12 పెంచాల్సి ఉందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రభుత్వానికి తెలిపాయి. ధరలు పెంచేందుకు అంగీకరించిన ప్రభుత్వం… పెంపుదలను దశలవారీగా చేపట్టమని సూచించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా గత నవంబర్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచలేదు. అయితే అప్పటి నుంచి క్రూడ్ ఆయిల్ ధర 40 శాతం పెరిగిందని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. ఇప్పటికే వంట నూనెలు, గోధమలు, ఎరువులు, కాపర్, స్టీల్, అల్యూమినియం ధరలు గణనీయంగా పెరిగాయి. కొన్ని దేశాల్లో బొగ్గు ధర రెట్టింపు అయింది. ఇవన్నీ చూస్తుంటే మన దేశంలో ద్రవ్యోల్బణం 6 శాతానికి దాటేలా ఉంది.