For Money

Business News

అపోలో హెల్త్‌లోకి పీఈ పెట్టుబడులు?

అపోలో హాస్పిటల్స్‌ పూర్తి అనుబంధ విభాగమైన ‘అపోలో హెల్త్‌కో’లో కొద్ది వాటాను విక్రయించేందుకు ప్రమోటర్లు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కంపెనీలో 0పెట్టుబడులు పెట్టేందుకు జనరల్‌ అట్లాంటిక్‌, సాఫ్ట్‌బ్యాంక్‌ సహా పలు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) కంపెనీలు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అపోలో హెల్త్‌కో మైనారిటీ వాటా విక్రయం ద్వారా 50 కోట్ల డాలర్ల (సుమారు రూ.3,750 కోట్లు) వరకు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఫార్మసీతోపాటు టెలీమెడిసిన్‌ సేవల విలీనం ద్వారా ‘అపోలో హెల్త్‌కో’ను అనుబంధ సంస్థగా అపోలో హాస్పిటల్స్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమెజాన్‌ కస్టమర్లు అపోలో ఫార్మసీ నుంచి ఔషధాలను ఆర్డర్‌ చేసే విధంగా రెండు కంపెనీల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది.