For Money

Business News

తెలంగాణలో పెప్సికో పెట్టుబడులు రెట్టింపు

దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో పెప్సికో సంస్థ ఉపాధ్యక్షుడు రాబర్డో అజేవేడోతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో సంస్థ కార్యకలాపాలు రెట్టింపు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. 2019లో 250 మందితో ప్రారంభమైన గ్లోబల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో ప్రస్తుతం 2800 మంది ఉద్యోగులు పని చేస్తున్నట్లు రాబర్డో అజేవేడో తెలిపారు. ఈ సంఖ్యను 4వేలకు పెంచనున్నట్లు చెప్పారు. ఏడాదిలో అదనపు ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు సంస్థ కార్యకలాపాలను భారీగా విస్తరిస్తామని చెప్పారు. అలాక్స్‌ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు వచ్చింది. బ్యాటరీల తయారీలో రంగానికి చెందిన ఈ కంపెనీ రూ.750కోట్లతో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. మాస్టర్‌ కార్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ మైఖెల్‌ ఫ్రొమన్‌ కూడా కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఎస్‌ఎంఈ, ఎంఎస్‌ఎంఈ రంగానికి కంపెనీలకు, రైతులకు సేవలు అందించే విషయమై వీరిమధ్య చర్చలు జరిగాయి.