For Money

Business News

నిలకడగా నిఫ్టి

స్టాక్‌ మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఉత్సాహంగా ముగిసినా… మెజారిటీ ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ ఒక శాతం లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు నిలకడగా ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్రస్తుతం 17928 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 35 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి షేర్లలో హిందుస్థాన్‌ లీవర్‌ ఒకటిన్నర శాతం లాభంతో టాప్‌లోఉంది. ఇక మెటల్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. మిడ్‌క్యాప్‌ షేర్ల సూచీ నష్టాల్లో ఉంది. బ్యాంకు షేర్లలో కూడా ఒత్తిడి కన్పిస్తున్నా… నష్టాలు నామ మాత్రంగానే ఉన్నాయి.