For Money

Business News

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ తగ్గించండి

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్‌ రానుంది. ఈ బడ్జెట్‌ నుంచి జనం ఏం కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ప్రముఖ బిజినెస్‌ దిన పత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో సగం మంది ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ను కేంద్రం తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం సాధారణ ఎన్నికల ముందు సమర్పించనున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇది. కాబట్టి ప్రభుత్వం కూడా జనం ఏం కోరుకుంటున్నారో పరిశీలిస్తోంది. అలాగే స్థానిక పరిశ్రమలకు ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వ రాయితీలు ఇవ్వాలని సర్వేలో పాల్గొన్నవారిలో 27 శాతం మంది కోరారు. మరో 20 శాతం మంది ఉపాధి కల్పనకు కేంద్రం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మరికొందరు రైతులకు మరిన్ని పథకాలు ప్రారంభించాలని కోరుతున్నారు.