For Money

Business News

మరో రూ.20 లక్షల కోట్లు కావాలి

ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం కోసం మరో రూ. 20 లక్షల కోట్లు కావాలని వైట్‌హౌస్‌కు పెంటగాన్‌ కోరింది. ఈ మేరకు అభ్యర్థన పంపింది. దీనికి అనుగుణంగా ఈ మేరకు కాంగ్రెస్‌లో బిల్లు పెట్టేందుకు ట్రంప్‌ సిద్ధమౌతున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌లో ఇప్పటికే రూ. 100 లక్ష కోట్లు కేటాయించారు. దీనికి అదనంగా మరో రూ. 20 లక్షల కోట్లు కావాలని పెంటగాన్‌ కోరుతోంది. అయితే ఈ ప్రతిపాదినకు డెమొక్రాట్లు వ్యతిరేకిస్తున్నారు. జనంలో కూడా యుద్ధం పట్ల వ్యతిరేకత వస్తోందని కొంత మంది రిపబ్లికన్‌ ఎంపీలు కూడా వాదిస్తున్నారు. అయితే అమెరికా ఆర్థిక మంత్రి బెసెంట్‌ మాత్రం పెంటగాన్‌ అభ్యర్థనను సమర్థించారు. చెడ్డవాళ్ళను చంపేందుకు ఆ మాత్రం ఖర్చు అవుతుందని అన్నారు. ఇప్పటికే ఈ యుద్ధంలో వాడిన ఆయుధాల స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సి ఉంటుందని అన్నారు.