పేటీఎం 9 శాతం ఎందుకు పడింది?
పేటీఎం కౌంటర్లో ఇవాళ తీవ్ర గందరగోళం ఏర్పడింది. పబ్లిక్ ఇష్యూ సమయంలో తమకు తప్పుడు సమాచారం ఇచ్చారని పేటీఎంకు సెబీ షోకాజ్ నోటీసు జారీ చేసిందని ఇవాళ ఉదయం మార్కెట్లో వార్తలు వచ్చాయి. దీంతో పేటీఎం షేర్ ఏకంగా 9 శాతం క్షీణించింది. పేటీఎం మాతృసంస్థ అయిన వన్ 97 కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన విజయ్ శర్మను కంపెనీ పత్రాల్లో ప్రమోటర్‌గా చూపకపోవడంపై సెబీ నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై తాము ఇప్పటికే సెబీకి సమాధానం ఇచ్చామని.. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజీకి సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నామని విజయ్ శర్మ తెలిపారు. సెబీ నుంచి మరింత సమాచారం కోరామని… సెబీ కోరిన సమాచారం ఇస్తామని అన్నారు. శర్మ వివరణ ఇచ్చినా షేర్ 4.48 శాతం నష్టంతో రూ. 530 వద్ద ముగిసింది.