పే టీఎం కీలక నిర్ణయం!
నిన్న ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికి చేరిన పేటీఎం షేర్ ఇవాళ స్వల్పంగా పెరిగి రూ. 749.90లకు చేరింది. ఇపుడు ఈ కంపెనీకి సంబంధించిన కీలక వార్తను మనీకంట్రోల్ డాట్ కామ్ ప్రచురించింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కోసం పేటీఎం పేమెంట్ బ్యాంక్ ఆర్బీఐకి దరఖాస్తు చేయనుందట. మే లేదా జూన్ కల్లా లైసెన్స్ కోసం దరఖాస్తు చేయనున్నట్లు బ్యాంక్ పేర్కొంది. పేమెంట్ బ్యాంక్‌ను పీటీఎం ప్రారంభించి అయిదేళ్ళు అవుతోంది. అయిదేళ్ళ అనుభవం ఉన్న పేమెంట్ బ్యాంక్… స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయొచ్చు. ఇప్పటి వరకు పేమెంట్ బ్యాంకులు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం దరఖాస్తు చేయలేదు. పేటీఎం తొలి సంస్థ అవుతుంది.ఆర్బీఐ నిబంధనల మేరకు పేమెంట్ బ్యాంక్ ప్రారంభించి అయిదేళ్ళు పూర్తి అయి ఉండాలి, అలాగే ఆ సంస్థ భారతీయుల నియంత్రణలో ఉండాలి. ఈ రెండు షరతలను పేటీఎం పేమెంట్ బ్యాంక్ పూర్తి చేసే అవకాశముంది.