పేటీఎం సగానికి పడినా…!
పేటీఎం లిస్టింగ్ రోజున మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.19 లక్షల కోట్లు. ఇవాళ మార్కెట్ క్యాప్ రూ.66,862 కోట్లు. దాదాపు సగానికి పడినట్లే. ఈ షేర్‌ను నమ్మి ఐపీఓలో షేర్లు కొన్నవారు, ఆ తరవాత పడి లేచిన తరవాత రూ.1900పైన కొన్నవారు భారీగా నష్టపోయారు. ఇవాళ ఈ షేర్ బీఎస్ఈలో 1,031.40లకు పడిపోయింది. ఇష్యూ ధర రూ. 2,150తో పోలిస్తే షేర్ దర 51 శాతం పడిపోయినట్లు లెక్క. గత ఎనిమిది సెషన్స్‌లో ఈ షేర్ పడుతూనే ఉంది. ఈ షేర్ నవంబర్ 18, 2021న మార్కెట్లో లిస్టయింది. కేవలం రెండు నెలల్లో ఇన్వెస్టర్లు 50 శాతంపైగా నష్టపోవడం చాలా అరుదైన అంశం. మొత్తం మార్కెట్ క్యాప్ ర్యాంకింగ్‌లో లిస్టింగ్ రోజున 50వ స్థానంలో ఉన్న కంపనీ ఇపుడు 77వ స్థానానికి పడిపోయింది. ఈ షేర్ ధర రూ. 900కి తతగ్గుందని బ్రోకరేజ్ సంస్థ Macquarie ఇచ్చిన సలహాతో ఈ షేర్లో అమ్మకాల ఒత్తిడి పెరుగుతోంది. ఇపుడున్న పరిస్థితి చూస్తుంటే ఈ షేర్‌కు రూ.900 వద్దయినా మద్దతు దొరుకుతుందేమో చూడాలి.