యాక్సిస్ బ్యాంక్‌తో పేటీఎం డీల్
తనకున్న నోడల్ ఖాతాలు/ ఎస్క్రో ఖాతాలను ప్రైవేట్ రంగ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్‌కు మార్చుతున్న పేటీఎం వెల్లడించింది. పేటీఎం ద్వారా డిజిటల్ చెల్లింపులు స్వీకరిస్తున్న మర్చంట్ బ్యాంకర్లు మున్ముందు కూడా అలా చేయొచ్చని కంపెనీ పేర్కొంది. తాజా డీల్‌కు సంబంధించిన వివరాలను బీఎస్ఈకి పంపిన నోట్లో పేటీఎం పేర్కొంది. తాజా ఒప్పందంతో పేటీఎంకు చెందిన సౌండ్ బ్యాక్స్, క్యూఆర్ కోడ్, పాయింట్ ఆఫ్ సేల్స్ టెర్మినల్స్ మార్చి 15 తరవాత కూడా పనిచేస్తాయని పేటీఎం పేర్కొంది.