కొత్త కనిష్టానికి పేటీఎం షేర్లు
మార్కెట్లో ఏ మాత్రం చిన్న కరెక్షన్ వచ్చినా ఇన్వెస్టర్లు వెంటనే చెక్ చేసే షేర్… పేటీఎం. మార్కెట్లో ఈ షేర్ ఓ కామెడీగా మారిపోయింది. రూ. 2150లకు జనాలకు అంటగట్టిన ప్రమోటర్లు… తరవాత గాలికి వొదిలేశారు. ఏడాది ఆరంభంలో దాదాపు రూ.1000కి చేరిన ఈ షేర్ ఇవాళ రూ. 990ని తాకి మరో రికార్డు సృష్టించింది. బ్రోకరేజ్ సంస్థ మక్యూర్ ఇచ్చిన టార్గెట్ ధర రూ. 900ను చేరడానికి ఈ స్టాక్ ప్రస్తుతమున్న దానికి 10 శాతానికి పడితే సరిపోతుంది. గత మూడు వారాల్లో ఈ షేర్ ధర 26 శాతం పడిపోయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 54 శాతం క్షీణించింది.