పరాస్ డిఫెన్స్: 180% లాభంతో లిస్టింగ్
అంచనాలకు తగ్గట్లుగానే పరాస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ షేర్ భారీ లాభాలతో లిస్టయింది. లిస్టింగ్ ధరతో పోలిస్తే ఓపెనింగ్‌లోనే 180శాతం ప్రీమియంతో లిస్టయింది. షేర్లు అలాట్ అయినవారికి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. అయితే చాలా చిన్న ఇష్యూ కావడంతో ఇన్వెస్టర్లు కూడా పెద్ద సంఖ్యలో లేరు. ఈ కంపెనీ రూ.175కు షేర్లను జారీ చేయగా, ఓపెనింగ్‌లోనే రూ.492 వద్ద లిస్టయింది. తొలిరోజే రూ. 175 పెట్టుబడిపై రూ. రూ.317 లాభం వచ్చింది.