పరస్ డిఫెన్స్ ఐపీఓ నేడే
పరస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ పబ్లిక్ ఆఫర్ ఇవాళ ప్రారంభం కానుంది. ఎల్లుండి ఈ షేర్ ఆఫర్ ముగుస్తుంది. మార్కెట్ నుంచి రూ.140.6 కోట్లను కొత్త షేర్లను జారీ చేసి సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ప్రమోటర్లు కూడా 17.2 లక్షల షేర్లను ఆఫర్ ఈ ఇష్యూ ద్వారా అమ్ముకుంటున్నారు. దీంతో వీరి వాటా 79 శాతం నుంచి 59 శాతానికి తగ్గుతుంది. ఆఫర్ ధర శ్రేణి రూ 165 – రూ.175. ఇందులో రూ. 34.4 కోట్లను ప్రి ఐపీఓ అలాట్‌మెంట్ ద్వారా సమీకరించనున్నారు. ఇది చిన్న ఇష్యూ కాబట్టి ట్రేడ్ టు ట్రేడ్ విభాగంలో లిస్ట్ అవుతుంది. ఉన్న బాకీలు తీర్చడానికి, కొత్త ఎక్విప్‌మెంట్ కొనుగోలు ఈ ఆఫర్ సొమ్ము ఉపయోగించనున్నారు. ఒక లాట్‌లో 85 షేర్లు ఉంటాయి. కాబట్టి ఒక లాట్ షేర్లు దరఖాస్తు చేసేందుకు రూ. 14,875 అవసరం. గరిష్ఠంగా 13 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. రక్షణ రంగానికి చెందిన వివిధ రకాల పరికరాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. లిస్టింగ్ ప్రీమియం గరిష్ఠంగా 30 శాతం ఉంటుందని భావిస్తున్నారు.