ప్లాస్టిక్‌పై నిషేధం.. పేపర్ షేర్లు జూమ్
వచ్చే ఏడాది జులై 1వ తేదీ నుంచి 100 మైక్రాన్ల కంటే తక్కువ మంది ఉండే ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంతో పేపర్ పరిశ్రమకు చెందిన షేర్లు భారీ లాభాలతో ముగిశాయి. ఈ రంగంలోని అనేక షేర్లు 20 శాతం లాభంతో ముగిశాయి. దశలవారీగా 120 మైక్రాన్లలోపు మందమున్న ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో… కాగితం పరిశ్రమలో జోష్ పెరిగింది. ఇది వరకే ముడి పదార్థాల ధరలు తగ్గడంతో కాగితం పరిశ్రమకు చెందిన షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అంతకుముందు కరోనా కారణంగా కూడా ఈ రంగం షేర్లు పెరిగాయి. ఇమామి పేపర్ మిల్, ఎన్ఆర్ అగర్వాల్ ఇండస్ట్రీస్, ఓరియంట్ పేపర్, పుదుంజీ పేపర్ ప్రొడక్ట్స్ షేర్లు 11 నుంచి 15 శాతం దాకా పెరిగాయి. ఇక జేకే పేపర్స్, సింప్లిక్స్ పేపర్, బీ అండ్ ఏ ప్యాకేజింగ్ ఇండియా, జెనస్ పేపర్ అండ్ బోర్డ్స్, గంగా పేపర్స్ ఇండియా, సంగల్ పేపర్స్, స్టార్ ఇండియా పేపర్ షేర్లు ఇవాళ అప్పర్ సర్క్యూట్ (5శాతం)లో ముగిశాయి.