నిమిషానికి 1100 ఫోన్ల విక్రయం
పండుగల సీజన్లో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు భారీ ఆఫర్స్ ప్రకటించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్స్ అనేక రకాల ఆఫర్లు ఉండటంతో…అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నెల 22వ తేదీ నుంచి 25 వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ.24,500 కోట్ల విలువైన వస్తువులను ఆన్లైన్ సంస్థలు అమ్మాయని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ రెడ్‌సీర్ పేర్కొంది. ఈ నాలుగు రోజుల్లో రూ.11 వేల కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోగా, సగటున నిమిషానికి 1100 ఫోన్లను అమ్మినట్లు వెల్లడించింది. దీని ప్రకారం సెకన్‌కు 18కి పైగా ఫోన్ల అమ్మకాలు జరిగాయన్నమాట. మొత్తం 60-70 లక్షల ఫోన్ల సేల్స్ జరిగాయని వివరించింది. ఇది గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు 28 శాతం పెరిగాయి.