కోవాగ్జిన్‌కు నో… 23% క్షీణించిన షేర్
రెండు సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ లోపు వారికి కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి నిరాకరించింది. దీంతో అమెరికాలో ఈ వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ ఆక్యుజెన్ ఇన్కార్పొరేటెడ్ షేర్ ధర ఇవాళ 23 శాతం క్షీణించింది. ఈ కంపెనీ భారత్‌కు చెందిన భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చేసి, అమెరికా మార్కెట్ చేసే హక్కులు పొందింది. ఎఫ్‌డీఏ అనుమతి రాకపోవడంతో షేర్‌పై ఒత్తిడి పెరిగింది.అనుమతి కోసం ఎఫ్‌డీఏ వద్ద ప్రయత్నాలు చేస్తామని ఆక్యుజెన్ పేర్కొంది.