For Money

Business News

నైకా పబ్లిక్‌ ఆఫర్‌ 28న ఓపెన్‌

నైకా, నైకా ఫ్యాషన్‌ల మాతృసంస్థ అయిన
FSN ఈ- కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 28న ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ.5,200కోట్లను సమీకరించేందుకు నైకా పబ్లిక్‌ ఆఫర్‌కు వస్తోంది. వీటిలో రూ.630కోట్ల విలువైన షేర్లను తాజాగా జారి చేస్తోంది. మరో 4.19 కోట్ల షేర్లను కంపెనీ వాటాదారులు విక్రయించనున్నారు. ఐపీఓ ధర శ్రేణి రూ.1,085-1,125. అక్టోబర్ 27నే యాంకర్ ప్లేస్‌మెంట్ కింద రూ.2,340 కోట్ల షేర్లను కేటాయించనున్నారు. నవంబర్ 1న ఐపీఓ ముగుస్తుంది.
గ్రే మార్కెట్‌లో…
నైకా షేర్లకు అనధికార మార్కెట్‌లో భారీ ప్రీమియం లభిస్తోంది. కంపెనీ ఇష్యూ గరిష్ఠ ధర రూ. 1,125 కాగా, అనధికార మార్కెట్‌లో రూ. 1775- రూ. 1,805 పలుకుతోంది. అంటే లిస్టింగ్‌ రోజున కనీసం 55 నుంచి 60 శాతం లాభం వచ్చే అవకాశముంది. నవంబర్‌ 8కల్లా షేర్ల అలాట్‌మెంట్‌ పూర్తి కానుంది. నవంబర్‌ 11న షేర్ల లిస్టింగ్‌ ఉంటుంది.