నంబర్ వన్‌గా ఎన్‌విడియా
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా ఎన్‌విడియా అవతరించింది. కొన్ని నెలలుగా నంబర్ వన్ స్థానంలో ఉన్న యాపిల్‌ను రెండో స్థానంలోకి నెట్టేసింది ఎన్‌వీడియో. సూపర్ కంప్యూర్స్ ఏఐ చిప్స్‌కు అనూహ్యంగా వచ్చిన డిమాండ్‌తో ఎన్‌విడియా షేర్ గత రెండేళ్ళలో కనీవినీ ఎరుగని స్థాయిలో లాభాలు ఆర్జించింది. అదే స్థాయిలో కంపెనీ షేర్ పెరిగింది. ఇవాళ స్టాక్ మార్కెట్‌లో ఎన్‌విడియా షేర్ల విలువ 3.53 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇప్పటి వరకు నంబర్‌వన్ స్థానంలో ఉన్న యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.52 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. గత జూన్‌లో కేవలం కొంతకాలం పాటు నంబర్‌స్థానంలో ఉంది ఎన్‌విడియా. అపుడు టాప్‌లో ఉన్న మైక్రోసాఫ్ట్, యాపిల్‌ను దాటింది. గత జూన్‌లో మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాప్ 3.20 లక్షల కోట్ల డాలర్లు. క్రమంగా మైక్రోసాఫ్ట్ కంటే ఫాస్ట్‌గా పెరిగి నంబర్ స్థానాన్ని యాపిల్ ఆక్రమించింది. ఈ అక్టోబర్‌లోనే ఎన్‌విడియా షేర్18 శాతం పెరిగింది.