టీనేజర్లకు కోవాగ్జిన్: WHO ఆమోదం లేదు
15 ఏళ్ళదాటిన టీనేజర్లకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రారంభించింది.ఈ మేరకు కోవిన్ యాప్లో మార్పులు చేసింది. ఆ యాప్లో కేవలం కోవాగ్జిన్ ఒక్కటే ఆప్షన్ పెట్టారు. అంటే 15 ఏళ్ళు దాటిన టీనేజర్లకు కోవాగ్జిన్ మాత్రమే వేస్తారన్నమాట. 12 ఏళ్ళు దాటిన టీనేజర్లకు అత్యవసరంగా ఉపయోగించేందుకు అనుమతి ఇచ్చినట్లు ప్రధాని మోడీ అన్నారు. మనదేశం అనుమతి ఇచ్చిందేమోగాని… ఈ వ్యాక్సిన్ టీనేజర్లకు వేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనుమతి లేదని ద హిందూ రాసింది. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాల్లో తప్పుగా దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఉందని పేర్కొందని వివరించింది. వాస్తవానికి 18 ఏళ్ళు దాటినవారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకా వేసేందుకే గత ఏడాది నవంబర్ 3వ తేదీన అనుమతి ఉంది. 12 ఏళ్ళు దాటిని టీనేజర్లకు కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయాలంటే భారత్ బయోటెక్ మళ్ళీ WHOకు డేటా సమర్పించాల్సి ఉంటుంది.