1 నుంచి స్లైస్ నిలిచిపోనుంది
క్రెడిట్ లావాదేవీల నిర్వహణలో సంలచనం సృష్టించిన స్లైస్ (slice) తన సేవలను నవంబర్ 1 తేదీ నుంచి నిలిపివేయనుంది. ఆర్బీఐ తాజా మార్గదర్శకాల అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ తెలిపింది. 1వ తేదీ నుంచి క్రెడిట్ లావాదేవీల కోసం స్లైస్‌ను వాడొద్దని పేర్కొంది. నవంబర్ నెలాఖరులోగా కొత్త అవతారంలో వస్తామని.. అపుడు క్రెడిట్, డెబిట్, యూపీఐ సేవలు కూడా అందిస్తామని పేర్కొంది. అప్ గ్రేడ్ అయిన వెంటనే తన ఖాతాదారులకు సమాచారం ఇస్తానని పేర్కొంది.