కొనసాగుతున్న ఎల్ఐసీ పతనం
మార్కెట్‌తో పాటు ఎల్ఐసీ షేర్ ధర పడుతూనే ఉంది. నిన్న మార్కెట్ భారీగా పెరిగినా ఎల్ఐసీ షేర్ రూ.876 వద్ద ఆగిపోయింది. లిస్టింగ్‌లో షేర్లు పొందిన వాటాదారులందరూ ఇపుడు నష్టాల్లో ఉన్నాయి. పాలసీదారులకు రూ.889వద్ద షేర్లు లభించినా… వారికి కూడా నష్టాలు తప్పలేదు. ఇవాళ కూడా ఓపెనింగ్‌లోనే ఎల్ఐసీ షేర్ రూ. 855.60ని తాకింది. నిఫ్టి దాదాపు 300 పాయింట్లకు పైగా నష్టంతో 15940 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక్కడి నుంచి నిఫ్టి కోలుకుంటేనే.. ఎల్ఐసీ కోలుకునే అవకాశాలు ఉంది. లేకుంటే షేర్ మళ్ళీ రూ. 855ని తాకుతుందని అనలిస్టులు అంటున్నారు.