ఎఫ్&ఓపై చర్చ జరగలేదు
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై అనేక అంశాలపై ఇవాళ సెబి బోర్డు సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని భావించారు. అయితే ఇవాళ్టి సమావేశంలో ఎఫ్ అండ్ ఓ అంశాలు చర్చకు రాలేదని సెబీ పేర్కొంది. మార్కెట్ క్యాప్‌లో టాప్ 500 కంపెనీల షేర్లలో టీ ప్లస్ జీరో సెటిల్‌మెంట్ సైకిల్ అమలు పర్చాలని సెబి నిర్ణయించింది. అంటే ట్రేడింగ్ చేసిన రోజే సెటిల్‌మెంట్ అన్న మాట. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ అడ్వయిజర్స్ అండ్ రీసెర్చి అనలిస్ట్‌లకు సంబంధించిన నిబంధనలను సరళీకరించినట్లు సెబి వెల్లడించింది. 3 ఇన్ వన్ ట్రేడింగ్ లేదా యూపీఐ బ్లాక్ మెకానిజాన్ని 2025 ఫిబ్రవరికల్లా అమలు పర్చాలని స్టాక్ బ్రోకర్లకు సెబి నిర్దేశించింది. మ్యూచువల్ ఫండ్ లైట్ ఫ్రేమ్ వర్క్‌కు కూడా ఇవాళ్టి బోర్డు సమావేశం ఆమోదించింది. నామినీల సంఖ్యను పదికి పెంచింది. అలాగే లావాదేవీ ప్రక్రియను మరింత సులువు చేసింది. నామినీ గనుక మరణిస్తే… వారి వారసులకు ఎలాంటి హక్కులు ఉండవని సెబీ పేర్కొంది.