For Money

Business News

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ లాభం రూ.1,310 కోట్లు

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో కంపెనీ టర్నోవర్‌ రూ.10,387.14 కోట్ల నుంచి 15.69 శాతం పెరిగి రూ.12,016.78 కోట్లకు చేరింది. ఆదాయం పెరిగినా బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు పెరగడంతో నికర లాభంలో మార్పు లేదని కంపెనీ తెలిపింది. మొత్తం వ్యయాలు రూ.8,724.43 కోట్ల నుంచి 17.02 శాతం పెరిగి రూ.10,209.43 కోట్లకు చేరాయి. బొగ్గు, పెట్‌ కోక్‌ ధరలు రెండింతలు కావడంతో వ్యయాలు 17 శాతం మేర పెరిగాయని, విద్యుత్‌ వినియోగం తగ్గించుకునేందుకు కార్యకలాపాలను పాక్షికంగా నిలిపామని కంపెనీ వివరించింది.