NIFTY TRADE: నో ఛాన్స్
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనూ నిఫ్టి ఓపెనైతే… డే ట్రేడర్స్‌కు పెద్ద ఛాన్స్ లేదు. అమెరికా ఫ్యూచర్స్ ప్రభావం, చైనా మార్కెట్ల నష్టాలు… మన మార్కెట్‌కు పాజిటివ్ కావొచ్చని అంటున్నా…భారీ గ్యాప్ అప్ వల్ల డే ట్రేడర్స్ లాభాలు అనుమానమే. నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చా? నిజానికి నిఫ్టికి 15,810-15,825 మధ్య అమ్మకాల ఒత్తిడి ఉంది. కాని చూస్తుంటే నిఫ్టి ఈ స్థాయిని దాటి అంటే 15,840ని దాటితే 15,900 దిశగా ప్రయాణం మొదలైనట్లే. 15,880-15,900 నిఫ్టి మధ్య అమ్మడానికి ఛాన్స్ ఉందా అన్నది అనుమానమే. ఎందుకంటే నిఫ్టి 15,900ని దాటితే 15,940 దాకా నిఫ్టికి అడ్డులేదు. ఇక సాంకేతికంగా చూస్తే స్వల్పలానికి నిఫ్టి బై సిగ్నల్ ఇస్తున్నా… పొజిషనల్ ట్రేడర్స్‌కు సెల్ సిగ్నల్ ఇస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు ప్రతిరోజూ అమ్ముతూనే ఉన్నారు. జులై నెలలో రూ. 26,000 నికర అమ్మకాలు జరిపారు. గత శుక్రవారం కూడా షార్ట్ పొజిషన్స్ తీసుకున్నారు. ఇవాళ నిఫ్టిని ఇంకా షార్ట్ చేస్తారా లేదా షార్ట్ కవరింగ్ వస్తుందా అన్నది అనుమానమే. ఇంట్రాడే ట్రేడింగ్‌కు నిఫ్టికి 15,720 వద్ద మాత్రమే బై సిగ్నల్ ఉంది. సో.. ఇవాళ కొనుగోళ్ళకు ఛాన్స్ లేనట్లే. ఇక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు నిఫ్టి 15,880-15,900 అమ్మి స్వల్ప లాభాలతో బయటపడొచ్చు. కాబట్టి నిఫ్టి గరిష్ఠ స్థాయి వరకు వచ్చే వరకు ఆగి షార్ట్ చేయాలి. యూరో మార్కెట్లు ఓపెనింగ్‌కు ముందు ఆ ఛాన్స్ వస్తుందేమో చూడండి. లేదంటే మార్కెట్‌కు దూరంగా ఉండటం మంచిది.