ఎయిర్‌పోర్టు సమీపంలో నో 5జీ
విమానాశ్రయాలకు సమీపంలో ఉన్నవారికి 5జీ సర్వీసులు అందించవద్దని కేంద్ర ప్రభుత్వం టెలికాం కంపెనీలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీయో, ఎయిర్టెల్, వొడాఫోన కంపెనీలకు టెలికాం శాఖ లేఖ రాసింది. ఎయిర్‌పోర్టుకు 2.1 కి.మీ. పరిధిలో 5 జీ సర్వీలు అందించవద్దని… ఒకవేళ అందించి ఉంటే నిలిపివేయాలని ఆ ఉత్తర్వల్లో పేర్కొన్నారు.ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని స్పష్టం చేశారు. సీ బాండ్ 5జీ వల్ల విమానంలో రాడార్ ఆల్టిమీటర్స్కు సమస్యలు వస్తున్నాయని పేర్కొంది. దీనివల్ల విమానాల టేకాఫ్, ల్యాండింగ్‌తో పాటు విమానాలు పర్వతాలను గుద్దుకోకుండా ఈ రాడార్ ఆల్టిమీటర్స్ సాయం చేస్తాయి. ఇలాంటి సమయాల్లో పైలెట్లు పూర్తిగా రేడియో (రాడార్) ఆల్టిమీటర్లపై ఆధారపడుతారని పేర్కొంది. అన్ని విమానాల్లోనూ రేడియో ఆల్టిమీటర్స్ ఫిల్టర్స్ ఏర్పాటు చేసే వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని టెలికాం శాఖ వెల్లడించింది.