For Money

Business News

మరో రూ. 3000 కోట్ల ఆఫర్‌

హెల్త్‌ ఇన్సూరెన్స్ రంగానికి చెందిన నివా బుపా పబ్లిక్‌ ఆఫర్‌కు సెబీ అనుమతి ఇచ్చింది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 3000 కోట్లు సమీకరించాలని నివా బుపా ప్రతిపాదించింది. రూ. 10 ముఖ విలువ గల రూ. 800 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తారు. అలాగే ప్రస్తుత ఇన్వెస్టర్లు తమ వాటాలో కొంత భాగాన్ని అమ్మడం ద్వారా రూ. 2,200 సమీకరిస్తారు. ఇందులో ప్రమోటర్లు కూడా ఉన్నారు. ఈ కంపెనీ పాత పేరు మ్యాక్స్‌ బుపా హెల్త్‌ ఇన్సూరెన్స్‌. ఈ కంపెనీలో అంత్జాతీయ బీమా సంస్థ బుపాకు మెజారిటీ వాటా ఉంది.
ఫెట్లే టోన్‌ ఎల్‌ఎల్‌పీ ఏకంగా రూ. 1880 కోట్ల విలువైన షేర్లను ఈ ఆఫర్‌ కింద అమ్ముతుండగా, బుపా సింగపూర్ హోల్డింగ్స్‌ పీటీఈ మాత్రం రూ. 800 కోట్ల విలువైన షేర్లను అమ్ముతోంది. బుపా సింగపూర్‌ సంస్థకు కంపెనీలో 62.27 శాతం ఉండగా, ఫెట్లే టోన్‌ ఎల్‌ఎల్‌పీకి 27.86 శాం వాటా ఉంది. కొత్త ఈక్విటీల జారీ ద్వారా సమీకరించే మొత్తంలో రూ. 625 కోట్లను ఈక్విటీ బేస్‌ పెంచుకునేందుకు ఉపయోగిస్తారు. స్టార్‌ హెల్త్‌ తరవాత పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న రెండో కంపెనీ ఇది.

Leave a Reply