For Money

Business News

హైదరాబాద్‌ మెట్రోలో రూ. 4,000 కోట్ల పెట్టుబడి?

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎల్‌ అండ్‌ టీకి చెందిన హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో రూ. 4000 కోట్ల పెట్టుబడి పెట్టే అంశాన్ని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (NIIF) యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెట్రో ప్రాజెక్టు బ్యాలెన్స్‌షీట్‌తోపాటు ఇతర కంపెనీ ఇంజీనిరింగ్‌ యాక్టివిటిని ఈ సంస్థ పరిశీలిస్తున్నట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక రాసింది. ఇప్పటికే నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును కరోనా తీవ్రంగా దెబ్బతీసింది. కంపెనీ నష్టాలు భారీగా క్షీణించాయి. రాష్ట్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న మెట్రోలో NIIF పెట్టుబడులు పెట్టే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. ఎందుకంటే NIIF కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇందులో 49 శాతం వాటా కేంద్రానికి ఉంది.2015 ఫిబ్రవరిలో ఏర్పాటైలన NIIFలో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ ఇప్పటికే 100 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది.