నిఫ్టి పైకి… షేర్లు దిగువకు
ఇవాళ మరో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఉదయం నుంచి లాభాల్లో కొనసాగిన నిఫ్టి ఒకదశలో 16,290 స్థాయిని తాకింది. మిడ్ సెషన్‌లో కాస్త ఒత్తిడికి లోనైనా 16,258 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 128 పాయింట్లు పెరిగింది. అయితే చాలా షేర్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టి 128 పాయింట్లు పెరిగినా…లాభాల్లో ముగిసిన షేర్లు 19 మాత్రమే. 31 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే రీటైల్ ఇన్వెస్టర్లకు దన్నుగా ఉన్న మిడ్ క్యాప్ షేర్ల సూచీ ఏకంగా 1.2 శాతం క్షీణించగా, నిఫ్టి నెక్ట్స్ 50 సూచీ కూడా 0.72 శాతం తగ్గింది. బ్యాంక్ నిఫ్టి మాత్రం రెండు శాతం లాభపడింది.
నిఫ్టి టాప్ గెయినర్స్
హెచ్‌డీఎఫ్‌సీ 2,672.00 4.59
కొటక్ బ్యాంక్ 1,751.20 3.89
ఐసీఐసీ బ్యాంక్ 712.05 3.14
ఎస్‌బీఐ 456.15 2.16
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1,465.50 2.15
నిఫ్టి టాప్ లూజర్స్
గ్రాసిం ఇండస్ట్రీస్ 1,553.00 -2.47
టైటాన్ 1,801.00 -2.13
టాటా మోటార్స్ 298.10 -1.84
అదానీ పోర్ట్స్ 693.50 -1.64
హిందాల్కో 441.70 -1.58