For Money

Business News

NIFTY TODAY: నిఫ్టి నిలబడుతుందా?

విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలను ఆపడం లేదు. కాని అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టి ఇవాళ కూడా భారీ లాభాలతో ప్రారంభం కానుంది. ముఖ్యంగా ఆల్ఫాబెట్‌ ఫలితాలతో ఇవాళ కూడా నాస్‌డాక్‌ లాభాలతో ప్రారంభం కావొచ్చు. ఆసియా మార్కెట్లు కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో నిఫ్టి తాజా లాభాలు నిలబడుతాయా అన్న చర్చ ఇపుడు మార్కెట్‌లో నడుస్తోంది. దీనికి ప్రధాన కారణంగా… క్రూడ్‌ ఆయిల్‌ పెరుగుతూనే ఉండటం, ఆర్బీఐ కూడా వడ్డీ రేట్లను పెంచుతుందనే మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 17,700ని దాటుతుందా అనేది చూడాలి. ఎందుకంటే నిఫ్టి తొలి ప్రతిఘటన అక్కడే ఎదురుకానుంది. డే ట్రేడర్స్‌కు ఇవాళ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17805
రెండో నిరోధం 17742
తొలి నిరోధం 17700
నిఫ్టికి కీలకం… 17481
తొలి మద్దతు 17454
రెండో మద్దతు 17412
డౌన్‌ బ్రేకౌట్‌ 17349

టెక్నికల్‌గా సూచీలు బై సిగ్నల్‌ ఇస్తున్నాయి. అయితే పడితే కొనే అంశాన్ని పరిశీలించడం. పైస్థాయిలో కొనుగోలు వొద్దని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. పొజిషనల్‌ ట్రేడర్స్‌ తమ పొజిషన్స్‌ కొనసాగించవచ్చు.