స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
నిఫ్టి 17,000 ప్రాంతాల్లో ఉన్నపుడు కదలికలు చాలా ఫాస్ట్ కన్పిస్తాయి. వంద పాయింట్లు కూడా శాతంలో చూస్తే చాలా తక్కువ. అందుకే ఓపెనింగ్‌లో 17,059ని తాకిన నిఫ్టి క్షణాల్లో 17,102 పాయింట్లను తాకింది. మొత్తానికి నిఫ్టి స్వల్ప లాభంతో 42 పాయింట్ల లాభంతో 17,117 పాయింట్ల వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. 17120 పాయింట్లను దాటితే నిఫ్టి తరువాతి ప్రతిఘటన స్థాయికి చేరే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టి స్థిరంగా ఉంది. మిడ్ క్యాప్ షేర్ల సూచీ కూడా అర శాతం దాకా లాభంతో ఉంది. నిఫ్టికి ఒక ప్రత్యేక రంగం నుంచి మద్దతు అందండం లేదు.
నిఫ్టి టాప్ గెయినర్స్
డాక్టర్ రెడ్డీస్ 4,874.50 2.33
సిప్లా 940.45 1.91
అదానీ పోర్ట్స్ 755.60 1.46
అల్ట్రాటెక్ సిమెంట్ 7,869.70 1.32
కోల్ ఇండియా 142.50 1.28
నిఫ్టి టాప్ లూజర్స్
హీరో మోటోకార్ప్ 2,715.15 -0.94
ఐఓసీ 110.00 -0.68
హెచ్‌సీఎల్ టెక్ 1,157.85 -0.58
పవర్ గ్రిడ్ 174.65 -0.57
ఐషర్ మోటార్స్ 2,688.60 -0.54