స్థిరంగా మార్కెట్లు
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా స్వల్ప నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలో 17445 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 17428 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 23 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి బ్యాంక్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు మాత్రం లాభాల్లో ఉన్నాయి. ఇవాళ కూడా అదానీ కౌంటర్లలో హడావుడి కన్పిస్తోంది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ కౌంటర్లో భారీ బ్లాక్ డీల్స్ నమోదు అయ్యాయి. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజస్‌లో మళ్ళీ ఒత్తిడి కన్పిస్తోంది. ఈ షేర్ మూడు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్ కూడా నష్టాల్లో ఉంది. అదానీ ట్రాన్స్‌మిషన్‌లో అయిదు శాతం వాటా చేతులు మారింది. ఈ షేర్ 5 శాతం లాభంతో ట్రేడవుతోంది. అదానీ గ్రీన్ కూడా అదే స్థాయి లాభంతో ఉంది. అయితే అదానీ టోటల్ మాత్రం క్రితం ముగింపు వద్దే ఉంది. అదానీ గ్రూప్‌నకు సంబంధించి పలు వార్తలు మార్కెట్లో వస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు అయోమయంలో ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ వ్యాపారం చేసేందుకు అనుమతి లభించడంతో బజాజ్ ఫిన్ సర్వ్ షేర్ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది.