For Money

Business News

నిలకడగా నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉండటంతో నిఫ్టి దిగువ స్థాయి నుంచి కోలుకుంది. ఉదయం లాభాలతో ప్రారంభమైన నిఫ్టి మిడ్‌ సెషన్‌కల్లా 18282 పాయింట్ల రెండో మద్దతు స్థాయిని తాకింది. ఈలోగా యూరో మార్కెట్లు లాభాలతో ప్రారంభం కావడంతో నిఫ్టి మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చి ఇపుడు 18,340 పాయింట్ల వద్ద 11 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు స్థిరంగా ఉన్నాయి. లాభాలకు స్పందిస్తూ కొన్ని షేర్ల ధరల్లో హెచ్చు తగ్గులు వినా.. పెద్ద మార్పులు లేవు. కొన్ని ప్రధాన షేర్లు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. జొమటొ రూ.70ని క్రాస్‌ చేసింది. ఫలితాలు బాగాలేనందున బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ నష్టాలతో ప్రారంభమైనా ఇపుడు మూడు శాతం లాభంతో ఉంది. నైకా ఇవాళ 9 శాతం క్షీణించడం విశేషం. ఆస్ట్రాల్‌లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. దివీస్‌ ఇవాళ లాభాల్లో ఉంది. అమెరికా ఫ్యూచర్స్‌ అర శాతంపైగా లాభంతో ఉన్నందున.. మన మార్కెట్లు కూడా లాభాల్లో క్లోజయ్యే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.