For Money

Business News

18350పైన నిఫ్టి

నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 18378ని తాకిన నిఫ్టి వెంటనే క్షీణించి 18344ని తాకింది. వెంటనే దిగువ స్థాయి నుంచి కోలుకుని 18364 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టితో పాటు నిఫ్టి బ్యాంక్‌, నిఫ్టి నెక్ట్స్‌ కూడా గ్రీన్‌లో ఉన్నా… లాభాలు పెద్దగా లేవు. ఇక నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ నష్టాల్లో ఉంది. నిఫ్టిలో 39 షేర్లు లాభాల్లో ఉన్నా… అన్నీ నామమాత్రమే. ఫలితాలకు అనేక షేర్లు రియాక్ట్‌ అవుతున్నాయి. గ్రీవ్స్‌ కాటన్‌ పది శాతం లాభపడగా, అపోలో టైర్స్‌ 5 శాతంపైగా లాభంతో ఉంది. ఇవాళ దివీస్‌ ల్యాబ్‌ రూ. 27 పెరగ్గా, రెయిన్‌బో హాస్పిటల్‌ రూ. 23 లాభంతో ట్రేడవుతున్నాయి. హెచ్‌బీఎల్‌ పవరకు రూ.100 దిగువన గట్టి మద్దతు లభిస్తోంది. నిన్న రూ.98 వద్ద ఉన్న ఈ షేర్‌ ఇవాళ రూ.5 పెరిగి రూ. 103.50 వద్ద ట్రేడవుతోంది.