స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైంది. సింగపూర్ నిఫ్టి 75 పాయింట్ల నష్టంలో ఉండగా… నిఫ్టి మాత్రం 17588 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్ల లాభంతో ఉంది. అదానీ ఓపెన్ ఆఫర్ నేపథ్యంలో ఎన్డీటీవీ షేర్ ఇవాళ కూడా మరో అయిదు శాతం పెరిగి రూ. 388.20 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద ఎన్ఎస్ఈలో లక్ష షేర్లకు కొనుగోలుదార్లు ఉన్నారు. మరోవైపు మీడియాకు చెందిన పలు షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. టీవీ టుడే షేర్ 7 శాతం లాభంతో ట్రేడవుతోంది. అలాగే రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన టీవీ బ్రాడ్కాస్ట్, నెట్వర్క్ 18 షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇక నిఫ్టి షేర్ల విషయానికొస్తే ఓఎన్జీసీ టాప్ గెయినర్‌గా ఉంది. నిఫ్టినెక్ట్స్లో మెక్ డొనాల్డ్, డీ మార్ట్, బంధన్ బ్యాంక్ షేర్లు దాదాపు రెండు శాతం లాభంతో ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో ఇవాళ కూడా ఒత్తిడి వస్తోంది. అదానీ గ్రీన్, అదానీ ట్రాన్స్ మిషన్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మర్ షేర్లు నష్టాలతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ షేర్లు ఇవాళ వెలుగులో ఉన్నాయి.