For Money

Business News

భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్‌

ఉదయం లాభాల్లో నుంచి నష్టాల్లోకి వెళ్ళిన మార్కెట్‌ పది గంటలకల్లా మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చింది. ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 18458ని తాకింది. కాని అక్కడి నుంచి బలహీనపడుతూ మిడ్‌సెషన్‌ కల్లా నిఫ్టి 18,262 పాయింట్లకు పడింది. దాదాపు రెండు వందల పాయింట్లు పడిందన్నమాట. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి ప్రస్తుతం 151 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి 0.82 శాతం నష్టంతో ఉండగా, నిఫ్టి నెక్ట్స్‌ 1.82 శాతం నష్టంతో, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి 2.19 శాతం నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్‌ నిఫ్టి గ్రీన్‌లో ఉన్నా నామ మాత్రపు లాభానికే పరిమితమైంది. నిఫ్టిలో ప్రస్తుతం 41 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. యూరప్‌ మార్కెట్లు రెడ్‌లో ఉన్నా… స్థిరంగా ఉన్నట్లే లెక్క. నష్టాలు నామ మాత్రంగా ఉన్నాయి కాబట్టి. నిఫ్టి ఓవర్‌బాట్‌ పొజిషన్‌లో ఉండటంతో పాటు మార్కెట్‌ను ఉత్తేజ పరిచే అంశాలు లేకపోవడంతో అమ్మకాలు జోరుగా ఉన్నాయి. నిఫ్టికి మూడో ప్రధాన మద్దతు స్థాయి వద్ద ఉంది. ఇక్కడ మద్దతు అందకపోతే 18,170కి వెళ్ళే అవకాశముంది. మద్దతు అందితే 18,310 ఆ తరవాత 18340కి చేరొచ్చు.