17250పైన నిఫ్టి
యూరో మార్కెట్లు ఒక శాతం పైగా లాభంతో ప్రారంభం కావడంతో మన మార్కెట్లు కూడా లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఉదయం 17184 వద్ద ప్రారంభమైనా.. తరవాత చాలా వరకు లాభాలను కోల్పోయింది. 17071ని తాకిన తరవాత నిఫ్టికి మద్దతు లభించింది. అక్కడి నుంచి నేరుగా 17252 ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 212 పాయింట్లకు పైగా లాభపడింది. హిందూస్థాన్ లీవర్, ఏషియన్ పెయింట్స్ షేర్ల నుంచి గట్టి మద్దతు లభించింది. ఉదయం డల్‌గా ఉన్న నిఫ్టి బ్యాంక్ కూడా 0.82 శాతం లాభపడింది. ఇవాళ బజాజ్ ఆటో టాప్ లూజర్‌గా నిలిచింది నిఫ్టిలో. జొమాటోలో ఒత్తిడి కన్పిస్తోంది. ఇవాళ అసలు ఒత్తిడి రిలయన్స్ మీడియా గ్రూప్ సంస్థల్లో కన్పిస్తోంది. ఈ గ్రూప్‌నకు చెందిన నెట్‌వర్క్ 1819 శాతం క్షీణించగా, టీవీ18 బ్రాడ్‌కాస్ట్ షేర్ 11.5శాతం నష్టంతో ట్రడవుతోంది. నిఫ్టిలో 42 షేర్లు లాభాల్లో ఉన్నాయి.