16900 పైన నిఫ్టి..
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఒక మోస్తరు నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలో 16917కి క్షీణించినా.. వెంటనే కోలుకుంది. ప్రస్తుతం 16946 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 45 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇతర ప్రధాన సూచీలన్నీ అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లు చాలా తక్కువ నష్టాలతో ట్రేడవుతున్నట్లు చెప్పాలి. నష్టాల్లో నిఫ్టి షేర్లలో హీరో మోటోకార్ప్ టాప్‌లో ఉంది. బజాజ్ ఫైనాన్స ఇవాళ కూడా 2 శాతం దాకా నష్టపోయింది. ఫలితాల తరవాత ఈ షేర్ పది శాతం వరకు నష్టపోయింది. గతవారం భారీగా నష్టోయిన నెట్వర్క్17 ఇవాళ గ్రీన్‌లో ఉంది.టీవీ18 బ్రాండ్‌కాస్ట్ స్థిరంగా ఉంది. ఇక ఐటీ షేర్లలో ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలిచింది.