For Money

Business News

DAY TRADING: నిలబడితే కొనండి

మార్కెట్‌ 200 నుంచి 250 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనపుడు.. ఆటోమేటిగ్గా మరింత అమ్మే ఛాన్స్‌ ఉండదు. కాబట్టి నిఫ్టి 16850ని తాకితే రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు కొనుగోలు చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. ఇది కేవలం డే ట్రేడింగ్‌ కోసమేనని అంటున్నారు. దిగువ స్థాయిలో కొని ఎదురు చూడటం మంచిదని… మార్కెట్‌ ఇవాళ గ్రీన్‌లోకి వచ్చినా రావొచ్చని ఆయన అంటున్నారు. రిస్క్‌ వొద్దనుకునేవారు మధ్యలోనే లాభంతో బయటపడొచ్చని అన్నారు. నిఫ్టి 16900పైన నిలదొక్కుకుంటే కొనుగోలు చేయొచ్చని మరో స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని తెలిపారు. దిగువ స్థాయిలో అమ్మడం వల్ల ప్రయోజనం లేదన్నారు. అయితే ఇది కేవలం డే ట్రేడింగ్‌కు సలహా మాత్రమేనని, రేపు సెలవు అయినందున.. పొజిషనల్‌ ట్రేడ్‌ కాదని ఆయన అన్నారు.