MID REVIEW: తగ్గేదే లేదంటున్న నిఫ్టి
ఉదయం స్వల్ప ఒత్తిడి వచ్చినా నిఫ్టి ఆకర్షణీయ లాభాల్లో కొనసాగుతోంది. ఉదయం 16,876 వద్ద ప్రారంభమైన నిఫ్టి 16942 దాకా వెళ్ళి ఒత్తిడికి లోనైంది. 10.30కల్లా వంద పాయింట్లు పడినా వెంటనే కోలుకుంది. మిడ్ సెషన్‌లో స్వల్పంగా తగ్గినా… ప్రస్తుతం 16909 వద్ద ట్రేడవుతోంది. యూరో మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. జర్మనీ డాక్స్‌తో పాటు పలు మార్కెట్లు రెండు శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. అమెరికా ఫ్యూచర్స్ కూడా అర శాతంపైగా లాభాల్లో ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే నిఫ్టి 16900పైన క్లోజయ్యే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి. ఫెడ్ బ్యాంక్ పావు శాతం, లేదా అర శాతం పెంచిన మార్కెట్ నిలదొక్కుకునే అవకాశముంది.