For Money

Business News

దుమ్ము రేపిన సూచీలు

ఇవాళ రాత్రికి అమెరికా ఫెడరల్ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకోనుంది. కనీసం పావు శాతం వడ్డీ రేట్లను పెంచవచ్చని భావిస్తున్నారు. మార్కెట్‌ మాత్రం ఇప్పటికే ఈ అంశాన్ని డిస్కౌంట్‌ చేసిందని అనలిస్టులు అంటున్నారు. చమురు ధరలు, డాలర్‌ తగ్గడంతో భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి మార్కెట్లు. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌ నుంచి భారీ లాభాల్లో ఉంది. మిడ్‌ సెషన్‌ స్వల్ప ఒత్తిడి వచ్చినా… మార్కెట్‌ అనలిస్టుల అంచనా ప్రకారం 16,660పైన నిఫ్టిలో భారీ షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. రేపు కూడా మార్కెట్‌ పెరుగుతుందనే అంచనాలతో షార్ట్‌ చేసినవారందరూ కొనుగోళ్ళకు పాల్పడ్డారు. నిఫ్టి ఒకదశలో 16,837 క్షీణించినా…2 గంటల తరవాత భారీగా పెరిగింది. ఒకదశలో 16987ని తాకిన నిఫ్టి…16975 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 312 పాయింట్లు లాభపడింది. ఇవాళ అత్యధికంగా నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 160 పాయింట్లు పెరిగింది. దాదాపు అన్ని సూచీలు రెండు శాతం లాభంతో ముగిశాయి.